రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంటున్నా.. టైమొస్తే వస్తా.. వరలక్ష్మీ శరత్ కుమార్

0
47
Varalaxmi

Varalaxmi

Varalakshmi sarathkumar comments on Political entry
Varalakshmi sarathkumar, Politics, Cinema, Pandemkodi 2, వరలక్ష్మీ శరత్ కుమార్, రాజతీయాలు, టైమ్, కన్నిరాసి, వెల్వెట్ నగరం, నీయా2

వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రస్తుతం వెరైటీ రోల్స్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయింది. విశాల్‌తో ప్రేమాయణాన్ని పక్కనబెట్టి హ్యాపీగా సినిమాలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో వరలక్ష్మి మాట్లాడుతూ.. టైమొస్తే.. రాజకీయాల్లో వస్తానని చెప్పింది.

‘కన్నిరాశి; ‘వెల్వట్‌ నగరం’, ‘నీయా 2’, ‘కాట్టేరి’ తదితర తమిళ చిత్రాలతో పాటు తెలుగులో ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌’లోనూ నటిస్తున్న వరలక్ష్మి..రాజకీయాల్లోకి వస్తానని, అయితే అందుకు ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పుకొచ్చింది.

మహిళల ఆత్మరక్షణ స్వీయ కర్తవ్యమేనని, ఆత్మరక్షణ విద్యలను అమ్మాయిలు నేర్చుకోవాలని అభిప్రాయపడిన వరలక్ష్మి, ప్రజలకు మేలు చేయాలంటే రాజకీయాలే చక్కని వేదికని, అవేమీ చెడ్డ విషయాలు కాదని చెప్పింది. ప్రస్తుతానికి తన తండ్రి పార్టీకి, తనకు సంబంధాలు లేవని వ్యాఖ్యానించింది. రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంటున్నానని వరలక్ష్మి వెల్లడించింది.