శత్రుదేశం సైన్యం చేతికి చిక్కి… మరణం అంచుల వరకు వెళ్లి వచ్చినప్పటికీ.. భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ అంకితభావం ఏమాత్రం చెక్కుచెదరలేదు. శత్రుదేశం చేతిలో బందీగా ఉన్నప్పటికీ అతను ప్రదర్శించిన ధైర్యసాహసాలు, తెలివితేటలకు యావత్ భరతజాతి ఫిదా అయిపోయింది.
ఇపుడు ఆస్పత్రిలో ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆర్మీ వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. తాను మళ్లీ యుద్ధవిమానం కాక్ పిట్‌లోకి వెళ్లేందుకు ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతున్నానని ఈ వింగ్ కమాండర్ వైద్యులకు తెలిపాడు. అందువల్ల తనను త్వరగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తే తక్షణం విధుల్లో జాయిన్ అవుతానని చెప్పారు. ఈ మాటలు విన్న వైద్యులతో పాటు అక్కడే ఉన్న ఐఏఎఫ్ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు.
అంతకుముందు, అభినందన్‌కు మెడికల్ టెస్టులు చేసిన డాక్టర్లు అతడి వెన్నెముక కింది భాగంలో స్వల్ప గాయం ఉన్నట్టు గుర్తించారు. దానివల్ల అతడి ఆరోగ్యానికి ఇబ్బందేమీ లేదని తేల్చారు. అంతేకాకుండా, భారత వర్గాలు భయపడినట్టుగా అతడి శరీరంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ బగ్స్ లేవని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.