Hailstorm kills over thousand birds near pench tiger reserve in madhyapradesh
Hailstorm, thousand birds, pench tiger reserve, madhyapradesh, మధ్యప్రదేశ్, పెంచ్ టైగర్ రిజర్వ్ , వడగండ్ల వాన, పక్షులు
వడగండ్ల వాన పక్షులను పొట్టనబెట్టుకుంది. వండగడ్లతో కూడిన వర్షం కురవడంతో వేల సంఖ్యలో పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. శనివారం నుంచి ఆదివారం వరకు ఈ వర్షం కురిసింది. దీంతో పక్షులు విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో చోటుచేసుకుంది.
మృతిచెందిన పక్షుల్లో 590 తెల్లకొంగలు, మృతి చెందిన వాటిలో 590 తెల్లకొంగలు, 360 చిలుకలు, 152 కాకులు ఉన్నట్టు పెంచ్ టైర్ రిజర్వు ఫారెస్ట్ ఫీల్డ్ డైరెక్టర్ విక్రం సింగ్ పరిహార్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. పెంచ్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన వడగళ్ల వానలో 1,102 పక్షులు మృతి చెందినట్టు అటవీ శాఖాధికారులు తెలిపారు.
చింద్వారా జిల్లాలోని ఖమర్‌పానీ, కన్హర్ గ్రామాల్లో ఆగకుండా కురిసిన వడగళ్ల వానలో ఇవి ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. వన్యప్రాణుల పరిరక్షణ చట్టం ప్రకారం వాటిని పరీక్షించిన తర్వాత వాటిని పాతిపెట్టినట్టు అధికారులు వెల్లడించారు.