ఎన్నికలకు ముందు విశాఖకు రైల్వే జోన్ ప్రకటించడం పట్ల జనసేనాని పవన్ కల్యాణ్ అనుమానం వ్యక్తం చేశారు. తాను ఆళ్లగడ్డలో మాట్లాడిన మాటలు పాకిస్థాన్లో వినిపించాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పోరాట యాత్రలో భాగంగా నెల్లూరులో పర్యటిస్తున్న పవన్ విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో పలు అంశాలపై స్పందించారు.
తాను నెల్లూరు వీఆర్ కాలేజీలో చదువుకున్నప్పుడు వ్యవస్థ మీద తనకు నమ్మకం ఉండేది కాదన్నారు. నాటి నుంచి నేటి వరకు వ్యవస్థలో ఇసుమంతైనా మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అరుపులు కేకలతో మార్పు రాదని, లంచగొండితనం పోదని అన్నారు.