కలబంద జెల్లే చాలు.. బ్యూటీపార్లర్‌కు వెళ్లక్కర్లేదు..

0
75

బ్యూటీపార్లర్‌కు వెళ్లక్కర్లేదు. చర్మసౌందర్యాన్ని కలబంద గుజ్జు పెంపొందింపజేస్తుంది. ఇంకా కంటికి కలబంద విశ్రాంతినిస్తుంది. కంటి వ్యాధులను దూరం చేస్తుంది. కలబంద గుజ్జును కంటిపై పది నిమిషాలు వుంచితే కంటి చుట్టు వలయాలు తొలగడమే కాకుండా కళ్ల మంటలు తగ్గిపోతాయి. కలబంద వృద్ధాప్య చాయలను తొలగిస్తుంది. చర్మం ముడతలు పడనీయకుండా కాపాడుతుంది.

ఇందులో విటమిన్ సి, బి వంటి ధాతువులు చర్మ ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతాయి. రోజూ చర్మానికి కలబంద గుజ్జును రాసుకుంటే బ్యూటీపార్లర్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తే చర్మం తేమగా వుంటుంది. చర్మంలోని కొల్లాజన్ అనే కొవ్వును కరిగించే శక్తి కలబందకు వుంది. అందుకే రోజు పది నిమిషాలైనా కలబంద గుజ్జును ముఖానికి రాసుకోవాలని బ్యూటీషియన్లు చెప్తున్నారు.