తెలంగాణ సీఎం కేసీఆర్, వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఒక్కటయ్యారంటూ మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ మాటల్లోనే ఈ వ్యవహారం మరోసారి బయటపడింది. కేటీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్‌నే వైసీపీ నేతలు చదువుతున్నారు. వైసీపీ ప్రొడక్షన్, టీఆర్ఎస్ డైరెక్షన్‌లో టీడీపీ సభ్యత్వం డేటా దొంగిలించారు.
డేటా చోరీ చరిత్ర మీది, బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీ మాది అంటూ నారా లోకేష్ అన్నారు. ఎన్నిసార్లు కోర్టు చీవాట్లు పెట్టినా మీకు బుద్ధి రాలేదు.. అమెరికాలో పర్సు పోతే హైదరాబాదులో ఫిర్యాదు చేస్తారా..? ఆంధ్రప్రదేశ్‌కి చెందిన డేటా పోయింది అని ఫిర్యాదు వస్తే ఏపీ పోలీసులకు కేసు బదలాయించాలి అని కూడా మీకు తెలియదా? అంటూ నిలదీశారు.