పాకిస్థాన్ బుద్ధి మారలేదు.. డ్రోన్ కూలింది.. యుద్ధంలో ఓడిపోతే..?

0
77
People worry as tensions mount between India and Pakistan.

పాకిస్థాన్ బుద్ధి మారలేదు. పాకిస్థాన్ ఎప్పటిలాగానే కవ్వింపు చర్యలు కొనసాగిస్తోంది. సోమవారం రాజస్థాన్‌లోని బికనేర్ నల్ వద్ద భారత గగనతలంలోకి ఓ డ్రోన్‌ను పంపించింది. అయితే ఈ డ్రోన్‌ను భారత్‌కు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం కూల్చివేసింది.

భారత గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించడంతో ఆ డ్రోన్ కూల్చివేసినట్లు భద్రతాధికారులు తెలిపారు. బోర్డర్‌లో డ్రోన్ ప్రవేశించినట్టు రాడార్లపై స్పష్టంగా కనిపించడంతో అందుబాటులో ఉన్న సుఖోయ్ యుద్ధ విమానం ద్వారా దాన్ని కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. భారత్‌తో సంప్రదాయ యుద్ధంలో పాకిస్థాన్ ఓటమిపాలైతే అణుదాడికి సైతం వెనుకాడదని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ హెచ్చరించారు. భారత్‌తో యుద్ధం వస్తే ఎక్కువ రోజులు నిలవగలిగే శక్తి పాకిస్థాన్‌కు లేదని స్పష్టం చేశారు. భారత్, పాక్ రెండూ అణ్వస్త్ర సహిత దేశాలే అయినా భారత్ మాత్రం అణుయుద్ధానికి దిగకపోవచ్చు.

ఇప్పటికే తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్ ఇతర ఇస్లామిక్ దేశాలు వేసే ముష్టితో బతుకుతోందని, యుద్ధం వస్తే పూర్తిగా దివాలా తీస్తుందని ఈ మాజీ సైనికుడు వ్యాఖ్యానించారు.

సర్జికల్ స్ట్రయిక్స్‌ ద్వారా భారత్ పంపిన సందేశం చాలా స్పష్టంగా ఉంది. తన జవాన్లను కానీ, పౌరులను కానీ చంపుతుంటే ఎవరినీ శిక్షించకుండా వదలదన్న విషయం ఈ దాడులతో అందరికీ తెలియజెప్పిందన్నారు.

People worry as tensions mount between India and Pakistan.