ఫిష్ ఫింగర్ ఎలా చేయాలంటే…

0
34

చేపల్లో వుండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు అభివృద్ధికి తోడ్పడుతాయి. దెబ్బతిన్న నాడీవ్యవస్థను మరమ్మతు చేయడానికి చేపలు ఉపయోగపడతాయి. మానసిక ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్న వారు చేపలు తింటే మానసిక ఆందోళనలను దూరం చేసుకోవచ్చు. అలాంటి చేపలతో ఫ్రై, గ్రేవీలు మాత్రమే కాకుండా ఫిష్ ఫింగర్స్ లేదా చిప్స్ కూడా ట్రై చేయొచ్చు.

అదేలాగో చూద్దాం..
కావల్సిన పదార్థాలు:
బాగా శుభ్రం చేసిన, చేప ముక్కలు – అరకేజీ
కారం: 1 టీస్పూన్,
బేకింగ్ పౌడర్ పావు టీస్పూన్,
సోడా: కప్పు,
మైదా- 1 టేబుల్‌స్పూన్,
కార్న్ ఫ్లోర్ -1 టేబుల్‌స్పూన్,
నూనె: సరిపడా
ఉప్పు – తగినంత

తయారీ విధానం..
ముందుగా మైదా, కారం, బేకింగ్ పౌడర్‌ను ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసి మిక్స్ చేయాలి. తర్వాత అందులో సోడా వేసి మొత్తం మిశ్రమాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. 3. బాగా కలిపిన మిశ్రమాన్ని అరగంట పాటు మిశ్రమాన్ని పక్కన ఉంచాలి. 4. తర్వాత అందులో ఉప్పు వేసి మెత్తగా కలగలుపుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లోర్, మైదాను ఒక ప్లేట్‌లో తీసుకొని బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్రమంలో బాగా శుభ్రం చేసిన చేప ముక్కల్ని వేయాలి. చేప ముక్కల మీద మైదా కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని చిలకరించాలి. ఆపై ఈ చేప ముక్కలను పిండి డిప్ చేయాలి. మరో పాన్ తీసుకొని అందులో పిండిలో డిప్ చేసిన చేప ముక్కలను ఫ్రై చేసుకుని సర్వింగ్ బౌల్‌కి తీసుకుని సాస్‌తో సర్వ్ చేస్తే టేస్టు అదిరిపోతుంది.