పెళ్లికి సిద్ధమవుతున్న తమన్నా

Tamannaah Bhatia To Get Married Soon

0
42
Tamannaah Bhatia
Tamannaah Bhatia

తెలుగు చిత్రపరిశ్రమలో పెళ్ళికాని ముదురు హీరోల్లో ప్రభాస్, నితిన్ వంటి స్టార్ హీరోలు ఉన్నారు. అయితే, హీరోయిన్ల విషయానికి వస్తే చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారిలో తమన్నా ఒకరు.

ఈమె నిన్నామొన్నటివరకు తన పెళ్లి గురించి పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. ఈ విషయంలో ప్రతి ఒక్కర్నీ తికమక పెట్టింది. కానీ ఇప్పుడు పెళ్ళి విషయంలో ఓ నిర్ణయానికి వచ్చిందట.

తన మనసులో ఎవరూ లేరనీ, తన పేరెంట్స్‌ ఎవర్ని చూపించి చేసుకోమంటే వారిని మరో ఆలోచన లేకుండా పెళ్ళాడేస్తుందట. ఇది ఫిక్స్‌ అని చాలా స్పష్టంగా చెప్పేసింది.

కాగా, శివరాత్రి పర్వదినాన కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శివరాత్రి జాగార వేడుకల్లో తమన్నాతో పాటు మరికొందమంది హీరోయిన్లు పాల్గొని డ్యాన్సులు వేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.