టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు.. ఇద్దరు చంద్రులకు చేతులెత్తి మొక్కుతున్నా..

0
57

2019 ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ముందుకు వెళ్తామని జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ మేనిఫెస్టో చూస్తుంటే భయమేస్తోందని… స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను బలిచేయొద్దన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. దిగజారుడు రాజకీయాలకు చెక్ పెట్టేందుకే పార్టీ పెట్టానన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చేశారు.

వైసీపీ మేనిఫెస్టోను అమలు చేయాలంటే కనీసం రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ కావాలని పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీలా తాను మోసపూరిత హమీలు ఇవ్వలేనని పేర్కొన్నారు. ఏవైతే నిజాయతీగా చేయగలనో, ఏవైతే అమలు చేయడానికి వీలవుతుందో అటువంటి హామీలు మాత్రమే ఇస్తానని పవన్ అన్నారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరుగుతున్న ‘డేటా యుద్ధం’పై మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చేతులెత్తి మొక్కుతున్నానని.. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల డేటాతో చెలగాటమాడకండంటూ కోరారు. డేటా యుద్ధంతో ప్రజలను బలిచేయొద్దన్నారు.