రికీ పాంటింగ్ రికార్డును బద్ధలు కొట్టిన సారథి కోహ్లీ

Virat Kohli becomes fastest to reach 9k runs international cricket captain

0
44
Virat Kohli
Virat Kohli

భారత పరుగుల యంత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేసింది. అంతర్జాతీయ వన్డేలో అత్యంత వేగంగా 9 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న భారత క్రికెటర్‌గా కోహ్లీ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.

గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్ ఖాతాలో ఉండేది. ఇపుడు ఈ రికార్డును కోహ్లీ బద్దలు కొడుతూ.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 9000 పరుగులు చేసిన సారథిగా ఘనత సాధించాడు.

రెండో వన్డేలో 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు ఈ మైలురాయిని చేరుకున్నాడు. కోహ్లీ కెప్టెన్‌గా 159 ఇన్నింగ్స్‌ల్లో 9 వేలు పూర్తి చేస్తే.. పాంటింగ్‌ అందుకు 203 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్లో 9000 పరుగులు చేసిన ఆరో కెప్టెన్‌ కోహ్లి. స్మిత్‌ (220 ఇన్నింగ్స్‌లు), ధోని (253), అలెన్‌ బోర్డర్‌ (257), ఫ్లెమింగ్‌ (272) ఈ జాబితాలోని ఇతర సారథులు.