హైదరాబాదీ స్టార్ ప్లేయర్ పీవీ సింధు ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో పీవీ సింధు చేసిన తప్పిదాలే ఆమె కొంప ముంచాయి. తద్వారా తొలి రౌండ్లోనే పీవీ సింధు పోరాటం ముగిసింది. సంగ్ జి హ్యున్ చేతిలో సింధు పోరాడి ఓడింది.
18 ఏళ్ల నిరీక్షణకు ఈసారైనా తెరపడుతుందునుకున్న అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. పోటీలకు తొలి రోజైన బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్ పోరులో ఐదో సీడ్ సింధు 16-21, 22-20, 18-21 తేడాతో సంగ్ జి హ్యున్(కొరియా) చేతిలో పరాజయం పాలైంది.
గత మూడు మ్యాచ్‌ల్లో సంగ్‌పై ఓడిపోవడం పీవీ సింధుకు ఇది మూడోసారి. ఓవరాల్‌గా ముఖాముఖి పోరులో సింధు 8-6తో ఆధిక్యంలో ఉండటం విశేషం. 81 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో సింధు చాలాసార్లు అనవసర తప్పిదాలతో పీవీ సింధు మ్యాచ్‌ను కోల్పోయింది. ఫలితంగా ఈ భారీ ఈవెంట్ నుంచి ఆమె నిష్క్రమించింది.