వీర జవాన్ల మృతదేహాలతో రాజకీయమా… సిగ్గనిపించడం లేదా?

Mamata Banerjee accuses PM Modi of doing opportunistic politics over the dead bodies of jawans

0
89
Mamata Banerjee
Mamata Banerjee

వీర జవాన్ల మృతదేహాలతో రాజకీయం చేయడాన్ని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి సిగ్గనిపించడం లేదా అంటూ మండిపడ్డారు.

పశ్చిమబెంగాల్‌లోని హౌరాలో జరిగిన ఓ కార్యక్రమంలో జవాన్ల వీర మరణంతో ప్రధాని మోడీ రాజకీయాలు చేస్తున్నారని, తానొక్కడినే దేశభక్తుడినని, మిగతావారు దేశద్రోహులని చిత్రీకరించే విధంగా మాట్లాడుతున్నారన్నారు.

జవాన్ల మృతదేహాలతో రాజకీయాలు చేయడం సిగ్గుగా లేదా? అని ప్రశ్నించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని, మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాజకీయ ఉనికికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ప్రజలకు సూచించారు.

గత ఐదేళ్ళ కాలంలో మీరు (మోడీ) చేసింది ఏమీ లేదు. పైగా మన జవాన్ల వీరమరణాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. మేం మోడీ ప్రభుత్వం వెనుక లేము. దేశానికి రక్షణ కల్పిస్తున్న మన సైనికుల వెంట ఉన్నాం అని అన్నారు. బాలాకోట్ ఉగ్రదాడుల వివరాలు బయటపెట్టమని తాము ప్రభుత్వాన్ని నిలదీస్తే మాపై పాకిస్థాన్ ముద్ర వేస్తున్నారని, ఆయన (మోడీ) తాను మాత్రమే భారతీయుడినని అనుకుంటున్నారని విమర్శించారు.