ఈ పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ సి సమృద్ధిగా ఉన్నాయి. ఈ పండ్లను చిన్నప్పటి నుండి తినడం వలన మధుమేహం రాదనీ, వచ్చే అవకాశాలు ఉన్నా తర్వగా రాదనీ వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే రక్తంలో పెరుకొని ఉన్న చక్కెరకి నేరేడుని మించిన విరుగుడు లేదంటున్నారు.
ఈ పండ్లలో పుష్కలంగా ఉండే ఐరన్ వలన హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. ఉదయాన్నే ఉప్పు లేదా తేనేతో కలిపి తింటే పైల్స్ వ్యాధి తగ్గుతుంది. క్రమం తప్పక తింటే దగ్గు, టీబీ వంటివి తగ్గతాయి. జీలకర్ర పొడి, బ్లాక్ సాల్ట్‌తో, కలిపి తీసుకుంటే ఎసిడిటి తగ్గుతుంది. చిగుళ్ల వ్యాధుల్నీ జలుబునీ అడ్డుకుంటాయి.
వానా కాలంలో ఎక్కువగా వచ్చే అతిసార, కలరా ఇతర వ్యాధులని అడ్డుకుంటాయి. నేరేడు గింజల పోడిని రోజూ ఒకటి లేదా రెండు టీస్పూన్ల చోప్పున మజ్జిగలో పాటు తీసుకుంటే వానా కాలంలో వచ్చే వ్యాధుల్ని నివారించవచ్చు. ఈ పొడి అతిదాహన్ని తగ్గిస్తుంది. యేడాదికి సరిపడా ఆరోగ్యాన్ని ఓకేసారి సొంతం చేసుకోవాలన్న ఆశతో అతిగా తింటే జ్వరాలు, ఒళ్లునొప్పులు వస్తాయి. మందుని మందులాగే వాడాలి.