అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యం గురించి..?

0
245

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8 న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా రాణిస్తున్నారు.

గతంలో ఈ పరిస్థితి భిన్నంగా వుండేది. పురుషులతో సమానమైన పనిచేసినా వారికి సరైన వేతనం వచ్చేది కాదు. పురుషులతో సమానమైన వేతనాలు, సమాన పని సమయం కోసం.. అమెరికాలోని పశ్చిమ పెన్సిల్వేనియాలోని ఒక బట్టల మిల్లులో తొలిసారిగా మహిళలు సమ్మే, ఆందోళనల బాట పట్టారు.

చివరకు 1857 మార్చి 8వ తేదీన ఈ సమ్మె విజయవంతమై అక్కడి మహిళలకు పురుషులతో సమాన గౌరవం దక్కింది. అందుకే అప్పటి నుండి మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపడం మొదలుపెట్టారు.

ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవానికి రోజు రోజుకు ప్రాముఖ్యత పెరిగింది. తద్వారా అన్నీ దేశాల్లో మహిళా దినోత్సవం జరగడం ప్రారంభమైంది. 1977లో ఐక్యరాజ్య సమితి మార్చి 8న మహిళా దినోత్సవం గా అధికారికంగా ప్రకటించింది.

మహిళలు సాధించిన విజయాలకు చిహ్నంగా సాధికారతను పొందే క్రమంలో ప్రతి ఏడాది మార్చి ఎనిమిదవ తేదీన విశ్వవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.