అనితకు చేదు అనుభవం.. టికెట్ ఇవ్వొద్దంటూ.. ఆందోళన

0
33
anitha-mla

anitha-mla

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు చేదు అనుభవం ఎదురైంది. అనితకు టికెట్ ఇవ్వొద్దంటూ టీడీపీ కార్యకర్తల ఆందోళన చేపట్టారు. స్టిక్కర్లు వేసి మరీ అనితకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో టీడీపీ ఎమ్మెల్యే తలపట్టుకున్నారు.

దీంతో పాటు టీడీపీ సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. అనితపై కొన్ని రోజులుగా కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సొంతపార్టీ కార్యకర్తల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో అనిత దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అనిత వద్దు.. టీడీపీ ముద్దు.. అంటూ ఇటీవల విశాఖపట్టణంలో టీడీపీ మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

అధిష్ఠానం సమక్షంలోనే కార్యకర్తలు అనితకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. రానున్న ఎన్నికల్లో ఆమెకు ఎట్టిపరిస్థితుల్లోనూ టికెట్ కేటాయించవద్దని కార్యకర్తలు అధిష్ఠానాన్ని డిమాండ్ చేస్తున్నారు.