టీడీపీకి రాజీనామా.. వైకాపా తీర్థం పుచ్చుకున్న జయసుధ

0
83

2019 ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ సినీ నటి జయసుధ టీడీపీకి రాజీనామా చేయనున్నారు. తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్‌ తగలింది. ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లో వైఎస్‌ జగన్ నివాసంలో ఆమె గురువారం భేటీ అయ్యారు. వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా కండువా కప్పి జయసుధను పార్టీలోకి ఆహ్వానించారు.

గతకొంత కాలంగా టీడీపీ కార్యక్రమాలకు జయసుధ దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో చేరేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్లు ఆ పార్టీ నేతలకు ఆమె వర్తమానం పంపారు. అందుకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జయసుధ వైకాపా తీర్థం పుచ్చుకున్నారు.

అనంతరం జయసుధ మీడియాతో మాట్లాడుతూ… తాను రాజకీయాల్లోకి రావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కారణం. వైఎస్సార్‌సీపీలోకి రావడం మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని వ్యాఖ్యానించారు.