గీతగోవిందం తర్వాత రష్మిక, విజయ్ దేవరకొండ జంట మళ్లీ జతకట్టనుంది. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా రష్మిక నటిస్తోంది. షూటింగు పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి.
విభిన్నమైన ప్రేమ కథాంశంతో నిర్మితమవుతోన్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మే 22వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ కారణంగానే టీజర్‌ను ఈ నాలుగు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ మేరకు ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, మెడికల్ స్టూడెంట్‌గా విజయ్ దేవరకొండ.. క్రికెటర్‌గా రష్మిక మందన కనిపించనున్న సంగతి తెలిసిందే.