‘స‌హృద‌య’ వ‌నిత‌

0
117

“అనూహ్యమైన” విజయాలకు “ఆమె ” పెట్టింది పేరు.
ఆమె వృత్తి “సితారా” లోకాన్ని అందంగా రంగరించడం.
ప్రవృత్తి మాత్రం”మానవత్వాన్ని” నిరంతరం పలకరించడం.
శాన్ ఫ్రాన్సిస్కో అమెరికా – ఫ్యాషన్ రంగం లో “మాస్టర్ డిగ్రీ” పట్టా !
చేతిలో, అల౦కారం గా ఉన్నా-
అమీర్ పేట లో “దుపట్టా”లేని వారిపై “దయ చూపిస్తుంది.
కట్టు-బొట్టు ఆత్మీయంగా అందిస్తుంది.
బహుశా అందుకే నేమో –
ఇంటర్నేషనల్ వండర్ బుక్ “ఆమె “పేరును
‘అద్భుత౦గా’ తనలో, రాసుకుంది.
జర్మనీ కి చెందిన ‘ఇంటర్నేషనల్ పీస్ యునివర్సిటి’ –
డాక్టరేట్ తో సగర్వం గా సన్మాని౦చుకుంది.
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా –
దక్షిణ భారత విభాగానికి, వైస్ ప్రెసిడెంట్ “హొదా”లో,
బాధ్యతలు స్వీకరించింది.
వొకేషనల్ ఎక్స్ లెన్స్ జాతీయ అవార్డు –
“ఆమె”సిగలో తాజా పూల కిరీటమైంది.
వెరసి – బ్యూటీ విత్ ద బ్రైయిన్స్-
హ్యూమనిటీ విత్ ద కరేజ్ –
సబలగా రూపు దిద్దుకుంటే –
ఆమె ఖచ్చితంగా అనూహ్య రెడ్డి మాత్రమే !!

వృత్తి ”సితార” ప్రవృత్తి ”మానవత్వం”.. అనూహ్య విజయాలకు కేరాఫ్ అడ్రస్ ఆమె. కన్నబిడ్డలను డేకేర్‌లలో విడిచిపెట్టి.. ఉద్యోగాల కోసం పరుగులు తీస్తున్న ఎందరో తల్లులున్నారు. అలాంటి వారి మధ్య.. దివ్యాంగులైన సంతానం కోసం నిరంతరం అంకితభావంతో పనిచేసే మాతృమూర్తులను గుర్తించి వారిని సత్కరించే పనిలో పడ్డారు… కోవిద సహృదయ స్థాపకురాలు, మానవతావాద నారీమణి, టాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్, డాక్టర్ అనూహ్య రెడ్డి.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కోవిద సహృదయ ఫౌండేషన్ ఆధ్వర్యం‌లో మాతృ శ్రీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం యూసఫ్ గూడ కృష్ణకాంత్ పార్క్‌కు సమీపంలోని సిద్ధార్థ్ కమ్యూనిటి హాల్‌లో ఘనంగా జరిగింది. గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో దివ్యాంగులైన సంతానాన్ని పోషించే.. మాతృమూర్తులకు,”మాతృ శ్రీ” అవార్డ్స్‌తో ఉచిత రీతిగా గౌరవించి సత్కరించే, మహోన్నతమైన కార్యక్రమానికి నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూబ్లీ హీల్స్ శాసన సభ్యులు శ్రీ మాగంటి గోపినాథ్ గారు ఐ.ఏ.ఎస్. అధికారిణి శ్రీమతి ఎమ్. బాల లత గారు విచ్చేశారు. జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ శ్రీ కిలారి మనోహర్, సిద్దార్థ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రెటరీ శ్రీ పొట్లూరి విజయ్ కుమార్, సంఘ సేవికామణి శ్రీమతి సత్యవాణి భారతీయం, జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీ ఎమ్. శ్రీనివాసులు, ప్రముఖ నటీమణి శ్రీమతి టీనా నాయుడు, యోగా తెరఫీ గ్రాండ్ మాస్టర్ శ్రీమతి జెస్సీ నాయుడు, యోగా ట్రైనర్ శ్రీమతి వేంగిపురపు పద్మ, ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ మహిత్ నారాయణ, ప్రముఖ సినీ నిర్మాత డెక్కెం వేణుగోపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయ౦ చేశారు. ఈ కార్యక్రమాన్ని కోవిద డిజైన్స్ సమర్పించగా – “వేవ్ ” ఈవెంట్ మ్యానేజెర్స్ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు.