బ్రెస్ట్ క్యాన్సర్‌ను పసిగట్టే బ్రా.. కేరళ సైంటిస్టుకు అత్యున్న నారీ శక్తి పురస్కారం

0
59
Dr Seema

 

Dr Seemaఅంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేరళ సైంటిస్ట్ అత్యున్నత నారీ శక్తి పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌ను పసిగట్టే బ్రాను కనుగొన్న ఆమెకు రాష్ట్రపతి ఈ అవార్డును అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. వివరాల్లోకి వెళితే.. కేరళ సైంటిస్ట్ డాక్టర్. ఎ. సీమా ఈ అవార్డును తన ఖాతాలో వేసుకున్నారు. సెన్సార్ అటాచ్డ్ బ్రాజర్‌ను కనుగొన్నారు. దీని సాయంతో బ్రెస్ట్ క్యాన్సర్‌ను పసిగట్టవచ్చు.

త్రిసూర్‌లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీలో ఆమె సైంటిస్టుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత మహిళా పురస్కారమైన నారీ శక్తి అవార్డును ఆమె అందుకున్నారు. శరీర ఉష్ణోగ్రత ఆధారంగా సెన్సార్ టచ్‌తో కూడా ఈ బ్రా.. బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందుగానే పసిగట్టేస్తుంది. ఈ బ్రాను ధరించిన 15 నుంచి 30 నిమిషాల్లోపు బ్రెస్ట్ క్యాన్సర్‌ వుందా లేదా అనేది తేలిపోతుంది.

ఈ బ్రాలు రూ.200 నుంచి రూ.500ల వరకు పలుకుతున్నాయని సీమా వెల్లడించారు. ఇప్పటివరకు 117 మంది రోగులను ఈ బ్రా ద్వారా పరిశోధించడం జరిగిందని.. ఈ పరిశోధన కూడా విజయవంతంమైందని సీమా చెప్పారు. ఇంకా ఈ బ్రాలను ధరించడం ద్వారా రేడియేషన్, ప్రైవసీ భయం అక్కర్లేదని.. ఇంకా ఎలాంటి నొప్పి వుండదని సీమా వెల్లడించారు.