సాధినేనికి నా వ్యక్తిగత జీవితం గురించి ఏం తెలుసు.. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే?

0
42

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినికి వార్నింగ్ ఇచ్చారు. వ్యక్తిగత జీవితంపై పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అసలు తన వ్యక్తిగత జీవితం గురించి వారికేం తెలుసని ప్రశ్నించారు. తనను విమర్శించేంత విలువలు మీకు ఉన్నాయా? అని నిలదీశారు. మర్యాదగా జనసేన కార్యకర్తలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోండని హెచ్చరించారు.

పల్నాడులో జరిగిన బహిరంగ సభలో జనసేనాని మాట్లాడుతూ.. యామినిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. నాడు మీ జెండాలు మోసిన వారిపై కేసులు పెచ్చి చచ్చిపోయేలా కొడతారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

తనను విమర్శించినందుకు తమ కార్యకర్తలు ఒక్కమాటంటే కేసులు పెడుతున్నారని.. ఇదేం ప్రజాస్వామ్యం అంటూ పవన్ ప్రశ్నించారు. ప్రభుత్వం హద్దులు దాటుతుందని.. తామిలాంటి గొడవలకు భయపడే ప్రసక్తే లేదన్నారు.