వైకాపా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా కోలగట్ల శ్రావణి

0
41
sravani

sravani

వైకాపా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైకాపా మహిళా విభాగాన్ని పటిష్టం చేసే పనిలో పడ్డారు.
వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా కోలగట్ల శ్రావణిని నియమిస్తున్నట్టు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.

పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆమెను నియమించినట్టు ఓ ప్రకటన వెలువడింది. ఇక తన నియామకం గురించి తెలుసుకున్న శ్రావణి, ఓ ప్రకటన విడుదల చేస్తూ, అందరి సహకారంతో వైసీపీ మహిళా విభాగాన్ని పటిష్టం చేయడమే తన లక్ష్యమన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను, జగన్ హామీలైన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల తరువాత జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడటమే లక్ష్యంగా కృషి చేస్తానని తెలిపారు.