ఆందోళనను దూరం చేసే జామకాయ..

0
44

జామకాయల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించే విటమిన్ సి అధిక మోతాదులో ఉంటుంది. ఇది నారింజ పండ్లలో దొరికే దానికన్నా నాలుగురెట్లు ఎక్కువ. ఇందులో ఉండే మెగ్నీషియం ఆందోళనను దూరం చేస్తుంది.

విటమిన్ ఎ అధిక మోతాదులో ఉండడం వల్ల దృష్టిలోపాలు దూరమవుతాయి. జామలో ఉండే ఫైబర్ల మూలంగా డయాబెటిస్ నివారణలోనూ జామకాయలు ప్రధానపాత్ర పోషిస్తాయి. శరీరంలో సోడియం, పొటాషియం పరిమాణాన్ని సమపాళ్లలో ఉంచి రక్తపోటు అదుపులో ఉండేందుకు సాయపడతాయి.

ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్లు, ఫ్లవనాయిడ్లూ, బీటా కెరొటిన్, ల్యూటిన్లు క్యాన్సర్ కారకాలను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. క్యాన్సర్ కణతులు వ్యాప్తి చెందకుండా కాపాడతాయి. జామకాయల్లోని ఎర్రని రకం జామకాయలు క్యాన్సర్ నివారణలో మరింతగా తోడ్పడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.