లైంగిక శక్తిని పెంచే పుచ్చకాయ

0
60

పుచ్చకాయలో వ్యాధినిరోధక శక్తినీ, గుండె ఆరోగ్యాన్నీ, కంటి, చర్మం ఆరోగ్యాన్నీ పరిరక్షించే కెరొటనాయిడ్లు ఉంటాయి. శ్వాసకోశాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, కేన్సర్‌ నిరోధకంగా పనిచేసే బీటా కెరోటిన్లు కూడా అవసరమైన మోతాదులో ఉంటాయి. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉండడం వల్ల వేసవిలో ఇది శరీరానికి కావాల్సిన చల్లదనాన్ని ఇస్తుంది. దాహార్తి నుంచి రక్షిస్తుంది.

ఇందులోని సిట్రులిన్‌ లైంగిక శక్తిని పెంచుతుంది. వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలను కూడా నివారిస్తుంది. లైకోసిన్‌ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తనాళాలు గట్టి పడి, బిగుసుకుపోకుండా కూడా కాపాడుతుంది. మెదడును శక్తివంతంగా మార్చడం ద్వారా మతిమరుపును కలిగించే అల్జీమర్‌ వ్యాధిని నిరోధిస్తుంది.

పుచ్చకాయ ముక్కలను రోజూ తీసుకుంటే గనుక.. పొట్ట నిండటమే కాదు. తేలిగ్గానూ అనిపిస్తుంది. పైగా ఇది శరీరంలో పేరుకొన్న సోడియంను కూడా తొలగిస్తుంది. విటమిన్‌ సి.. రోగనిరోధకశక్తిని పెంచుతుంది.