ప్రభాస్‌కు అలాంటి అమ్మాయే భార్యగా రావాలి.. కృష్ణంరాజు శ్రీమతి

0
39

బాహుబలి ప్రభాస్ హీరోగా సాహో సినిమా షూటింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తర్వాత మరో సినిమాలో ప్రభాస్ కమిట్ అయ్యాడని టాక్ వస్తోంది. ఇంకా ప్రభాస్ సినిమాల సంగతిని పక్కనబెడితే.. ఆయన పెళ్లిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది.

ప్రభాస్ పెళ్లెప్పుడు అనేదే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. తాజాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు శ్రీమతి శ్యామలాదేవి తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావించారు. ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఇంతవరకూ వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు.

ప్రభాస్ పెళ్లికి సంబంధించి వస్తోన్న పుకార్లను తాము సరదాగా తీసుకుంటామేగానీ .. పెద్దగా పట్టించుకోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభాస్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలను పూర్తిచేయగానే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే ప్రభాస్‌కు తమ కుటుంబంతో కలిసిపోయే అమ్మాయితో వివాహం జరగాలని కోరుకున్నారు.

తమది చాలా పెద్ద కుటుంబం .. అందరం కలిసిపోయి ఎంతో ఆప్యాయంగా ఉంటాము. అలా మా అందరిలో కలిసిపోయే అమ్మాయే ప్రభాస్‌కి భార్యగా రావాలని తామంతా కోరుకుంటున్నాము. అలాంటి అమ్మాయే వస్తుందని మేమంతా ఆశిస్తున్నామని తెలిపారు.

ఇదిలా ఉంటే.. సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘సాహో’ సినిమా రూపొందుతోంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ సినిమాకి ఇంటర్వెల్ ఎపిసోడ్ హైలైట్‌గా నిలుస్తుందట. హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను భారీస్థాయిలో చిత్రీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసమే దాదాపు 30 కోట్లను ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీనగానీ, దసరా కానుకగా విడుదల చేసే అవకాశం వున్నట్లు సమాచారం.