బొప్పాయిలో క్యాలరీ తక్కువండోయ్.. ఊబకాయులకి ఎంతో మేలు

0
102

బొప్పాయిలో క్యాలరీలు తక్కువ కాబట్టి ఊబకాయులకి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయిలో పుష్కలంగా ఉండే విటమిన్‌-ఎ కారణంగా దీన్ని క్రమం తప్పక తినేవాళ్లలో చర్మం మెరుపుని సంతరించుకుంటుంది. బొప్పాయి గుజ్జుని ముఖానికీ పట్టిస్తే చర్మం మిలమిల మెరిసిపోతుంది. ఎండకు కమిలిన చర్మం తిరిగి తేజోవంతమవుతుంది. ఇందులోని లైకోపీన్‌ ముడతల్ని తగ్గిస్తుంది.

బొప్పాయి మంచి క్లెన్సింగ్‌ లోషన్‌. అందుకే బొప్పాయిని ఫేస్‌ప్యాకులూ సబ్బులూ క్రీముల్లో వాడుతుంటారు. బొప్పాయిలోని బీటా కెరోటిన్‌ ఆస్తమానీ; ప్రొస్టేట్‌, కోలన్‌ క్యాన్సర్లనీ నిరోధిస్తుంది. బొప్పాయిలోని పీచు మధుమేహులకి మంచిది. ముఖ్యంగా పచ్చిబొప్పాయిలోని పోషకాలకి కొలెస్ట్రాల్‌ తగ్గడంతోబాటు మధుమేహం నియంత్రణలో ఉంటుంది.