రాంచీ వన్డే.. కంగారూల చేతిలో సొంతగడ్డపైనే ఖంగుతింది..

0
50

ఆస్ట్రేలియాతో రాంచీలో జరిగిన మూడో వన్డేలో భారత్ పోరాడి ఓడింది. ఫలితంగా 32పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలుపును నమోదు చేసుకుంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసి భారత్‌కు 314 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.

భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ 123 పరుగులు, శంకర్ 32, ధోని 26, జాదవ్ 26 పరుగులు చేశారు. ఫలితంగా 281 పరుగులకే భారత్ ఆలౌటైంది. ఫలితంగా మూడో వన్డేలో భారత్ కంగారూల చేతిలో ఖంగుతింది. కాగా ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 21 ఆధిక్యంలో ఉంది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు చెలరేగి ఆడింది. భారీ విజయలక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఖవాజా 104 పరుగులు, ఫించ్ 93 పరుగులు, మ్యాక్స్ వెల్ 47 పరుగులు, స్టాయినిస్-31 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో కుల్ దీప్ యాదవ్ -3, షమీ-1 వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.