రైతు కుటుంబానికి రూ.8వేలు.. మహిళలకు 33 శాతం పదవులు

0
57

ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మ్యానిఫెస్టోలో ఉన్న కీలక అంశాలను ముందే బయటపెట్టారు. మహిళల అభ్యున్నతికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పిన ఆయన మహిళలకు తమ పార్టీలో 33 శాతం మేర పదవులు కేటాయించామని తెలిపారు.

చట్టసభల్లో కూడా 33 శాతం మహిళలకే అమలు చేయాలని ఉందని, అయితే ప్రత్యర్థుల వ్యూహాలను బట్టి తన నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి రైతు కుటుంబానికి రూ.8 వేలు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్టు తెలిపారు.

రైతు కుటుంబాల్లోని ఆడపడుచుల కోసమే ఈ సాయం అంటూ స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకంతో వ్యవసాయరంగాన్ని అనుసంధానం చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు.

గుంటూరు వద్ద ఉన్న హాయ్‌లాండ్‌లో పార్టీ మహిళా విభాగం వీర మహిళ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. జనసేన వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలను సత్కరించారు.

ఏపీ ప్రభుత్వం మీద కూడా పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ఉపాధి హామీలో అన్నీ అవకతవకలే ఉన్నాయన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని వెల్లడించారు.