ఆ పాప ఏం పాపం చేసింది.. అలా ముళ్ల పొదల్లో పడేసి వెళ్లారే?

0
47

దేశంలో అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. పెరుగుతున్న ఆధునికత కారణంగా మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. భార్యాభర్తల అనుబంధాలు అక్రమేతర సంబంధాలతో మంటగలిసిపోతున్నాయి. ఈ సంబంధాల చేత చిన్నారుల జీవితాలు నాశనమవుతున్నాయి.

తాజాగా ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హోళిగుంద మండలం మెర్మికి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్ల పొదల్లో పడేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా చిన్నారి ఏడుపు విన్న స్థానికులు పాపను రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

శిశువుకు వైద్యం అందించిన వైద్యులు.. చిన్నారికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని చెప్పారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా వుందని.. త్వరలోనే పోలీసుల సాయంతో చిన్నారిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని వైద్యులు వెల్లడించారు.