అసలే వేసవికాలం మొదలైంది. ఇందుకు తోడు ఎన్నికల నగరా కూడా మోగింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలన్నీ ఒకే దశలో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తొలి దశలోనే ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 18న, నామినేషన్ల దాఖలుకు చివరి తేది మార్చి 25 అని ఎన్నికల సంఘం వెల్లడించింది. మార్చి 26న నామినేషన్ల పరిశీలన, మార్చి 28న నామినేషన్ల ఉపసంహరణ, పోలింగ్ ఏప్రిల్ 11న, ఓట్ల లెక్కింపు మే 23న వుంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం అన్నీ పార్టీలు సంసిద్ధమవుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో శంషాబాద్‌లో శనివారం సాయంత్రం కాంగ్రెస్ నిర్వహించిన రాహుల్ భారీ బహిరంగ సభలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. రేవంత్ హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ సభకు గైర్హాజరు కావడంపై నేతలు చర్చించుకుంటున్నారు.
నిజానికి రాహుల్ గాంధీ సభల్లో రేవంత్ ముందు వరుసలో ఉండేవారు. అటువంటి రేవంత్ సభలో కనిపించకపోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.