హరికృష్ణ శవాన్ని పక్కనబెట్టుకుని.. చంద్రబాబు రాజకీయాలు చేశారు..

0
35

కాకినాడ శంఖారావ సభలో వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నందమూరి హరికృష్ణ శవాన్ని పక్కనబెట్టుకుని సీఎం చంద్రబాబు రాజకీయాలు చేశారని జగన్ మండిపడ్డారు.

ఏపీలో లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నాయని… ఆ దొంగ ఓట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటి వద్దకు దొంగ సర్వేలు వస్తాయని తెలిపారు. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ఎన్నో మోసాలకు తెరదీస్తారని చెప్పారు. ఎన్నికలకు సమయం ఆసన్నమైన తరుణంలో ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

చంద్రబాబు మాటలను నమ్మవద్దని జగన్ సూచించారు. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయని… రాత్రి ఏడు దాటితే గ్రామాల్లో తిరగడానికి మహిళలు భయపడుతున్నారని జగన్ ఫైర్ అయ్యారు. అవినీతి లేని స్వచ్ఛమైన పాలనను అందించడమే తన లక్ష్యమని వెల్లడించారు.

ప్రజలంతా సంతోషంగా ఉండాలంటే అది రాజన్న కొడుకు జగనన్న చేతిలోనే ఉందనే విషయం ప్రతి అక్కకు, చెల్లికి, అన్నకు, తమ్ముడికి చెప్పాలని తెలిపారు. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రతి రైతు కుటుంబానికి రూ. 12,500 చేతిలో పెడతామని హామీ ఇచ్చారు. పెన్షన్లను రూ. 3వేలకు పెంచుతామని చెప్పారు.