చాలామంది అల్పాహారం తీసుకోరు. ముఖ్యంగా, ఊబకాయంతో బాధపడేవారు, బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్‌ఫాస్ట్‌కు దూరంగా ఉంటుంటారు. ప్రతి నిత్యం ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్పాహారం తీసుకోకుండా, నేరుగా మధ్యాహ్నమే భోజనం తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే టైప్ 2 డయాబెటిస్ ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
* అల్పాహారం మానేయడం వల్ల గుండె జబ్బులు వచ్చేందుకు, స్ట్రోక్స్ బారిన పడే అవకాశాలు ఎక్కువ.
* బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే అధికంగా బరువు పెరగడమే కాదు శరీరంలో కొవ్వు పేరుకుపోతుందట.
* అల్పాహారం మానేస్తే మెదడు యాక్టివ్‌గా ఉండదట. ఈ కారణంగా ఉత్సాహం, చురుకుదనం తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.