డేటింగ్‌ ముగిసింది… ఇకపై పెళ్లి వంతు… ఎవరా జంట?

Jennifer Lopez, Alex Rodriguez Officially Engaged

0
61
Jennifer Lopez - Alex Rodriguez
Jennifer Lopez - Alex Rodriguez

ప్రముఖ సంగీత సెలెబ్రిటీ జెన్నీఫ‌ర్ లోపేజ్ – మాజీ బేస్ బాల్ స్టార్ అలెక్స్ రోడ్రిగేల రెండేళ్ళ డేటింగ్ ప్రక్రియ ముగిసింది. వీరిద్దరూ ఇకపై పెళ్లి బంధంతో ఒక్కటికావాలన్న నిర్ణయానికి వచ్చారు. ఫలితంగా ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు.

ఈ ఎంగేజ్‌మెంట్ తంతులోభాగంగా, అలెక్స్.. జెన్నీఫ‌ర్ చేతికి తొడిగిన వ‌జ్ర‌పు ఉంగరం తొడిగింది. ఈ ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

2005లో షియా స్టేడియంలోని క్వీన్స్ బ్యాక్‌లో తొలిసారి వీరిద్ద‌రు క‌లిసారు. అలెక్స్ 22 సీజ‌న్స్‌లో బిగ్ లీగ్స్‌లో పాల్గొన‌గా 2016లో రిటైర్ అయ్యారు.

ఇక జెన్నీఫ‌ర్ విష‌యానికి వ‌స్తే గ‌తంలో ఆమె మూడు సార్లు వివాహం చేసుకుంది. ఆమె 11 ఏళ్ళ క‌వ‌ల‌ పిల్ల‌ల‌కి త‌ల్లి కూడా. జెన్నీఫ‌ర్ మ్యూజిక‌ల్ హిట్స్‌లో జెన్నీ ఫ్ర‌మ్ ది బ్లాక్, ల‌వ్ డోంట్ కాస్ట్ ఏ తింగ్‌, వెయిటింగ్ ఫ‌ర్ టూ నైట్ ప్ర‌ముఖ‌మైన‌వి.