ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో ముల్లంగి ఒకటి. ఇందులో అనేర రకాలైన పోషకాలు మెండుగా ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
* ముల్లంగిలో విటమిన్ సి పుష్కలం. సలాడ్లతో తినడం వల్ల ఆ విటమిన్‌ను పూర్తి స్ధాయిలో పొందవచ్చు. ఇది శరీరకణాల మీద ఒత్తిడిని తగ్గిస్తుంది.
* ఇందులో తక్కువ క్యాలరీలు ఎక్కువ నాణ్యమైన పీచుపదార్థాన్ని అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు ముల్లంగిలో అత్యధికం. ఫలితంగా రోగనిరోధక శక్తిని మరింతగా పెంచుతుంది.
* రక్తంలో గ్లూకోజు స్థాయిని నియంత్రించే శక్తి ఉండటంతో.. మధుమేహం ఉన్నవారికి ముల్లంగి ఆరోగ్యదాయకం.
* ముల్లంగి జీర్ణవ్యవస్థ సంబంధ కేన్సర్లను నియంత్రిస్తుంది.
* ముల్లంగి దుంపలా కనబడినా క్యాబేజీ, క్యాలీఫ్లవర్ కుటుంబానికి చెందినది. ఇందులో ఐరన్, క్యాల్షియం, మాంగనీసు, మెగ్నీషియం వంటి ఖనిజాలు, పీచు పదార్థాలు విరివిగా ఉన్నాయి.