* బెల్లంలో పీచు ఎక్కువగా ఉంటుంది. ముదురు రంగు బెల్లంలో కల్తీ ఉండదు. దీనిలో రసాయనాలు ఉండవు. చక్కెర శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
* బెల్లంలో పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, ఫోలిక్ ఆమ్లాలూ పుష్కలంగా ఉన్నాయి. రోజూ కొంచెం బెల్లం తీసుకుంటే శరీరానికి శక్తి లభిస్తుంది. * డయాబెటిస్‌తో బాధపడేవారికి మంచి బెల్లం మంచి డైట్. బెల్లంలో యాంటీ అలర్జిక్ గుణాలు ఆస్తమా, బ్రాంకైటిస్, శ్వాస సంబంధమైన వ్యాధులను నివారీస్తాయి.
* బెల్లం తినటం వలన శరీరంలోని విషపదార్థాలన్ని బయటకు పోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
* వేడి నీళ్లలో బెల్లం కలుపుకొని తాగితే జలుబు, దగ్గు తగ్గిపోతాయి.టీలో చక్కెరకు బదులు బెల్లం వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది. పాలతో లేదా అల్లంతో కలిపి బెల్లం తీసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎముకలు గట్టిపడతాయి.