రోజంతా చలాకీగా ఉండాలంటే…

0
70

* కొన్ని రకాల ఆహర పదార్థాలు ఆరగిస్తే చాలా భారంగానూ, ఆయాసంగానూ ఉంటుంది. మరికొన్ని పదార్ధాలు తిన్నప్పుడు ఎంతో తేలికగానూ హుషారుగాను ఉంటారు. మన శరీరాన్ని చలాకీగా ఉంచే ఆహర పదార్ధాలు కొన్ని ఉన్నాయి.

* బీటరూట్ బీపీ రోగులకు ఎంతో మేలు చేస్తుంది. బీట్ రూట్ తీసుకోవడం వల్ల శక్తితో పాటు అందులోని నైట్రేట్ల కారణంగా రక్తనాళాలు వ్యాకోచించడంతో రక్తసరఫరా మెరుగై బీపీ తగ్గుతుంది. ఇందులోని పీచు కారణంగా బరువు తగ్గుతారు.

* చేపలలో ఉండే విటమిన్ డి, బి2, ఒమేగా 3 ఫాటీ ఆమ్లాలు, ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండటంతో మెదడును చురుగ్గా ఉంచుతాయి.ఆలసటనీ బద్ధకాన్నీ తగ్గిస్తాయి.

* అరటిపండు మంచి పౌష్టికాహారం. ఇందులోని పిండిపదార్ధాలు, విటమిన్ బి6, పోటాషియం, పీచు శక్తినివ్వడంతోబాటు ఆకలిని తగ్గిస్తాయి.