హాస్యనటుడు అలీ వైకాపా చేరేందుకు టీడీపీ సర్వే కూడా కారణమని తెలుస్తోంది. సినీ నటుడు అలీని తాము తిరస్కరించాకే జగన్ పంచన చేరారని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా వెల్లడించారు. అలీని అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఆ సీటులో ఓటమి తప్పదని సర్వేలో తేలిందని.. అందుకే ఆయనకి నో చెప్పామని వ్యాఖ్యానించారు.
ఇకపోతే.. సినీ నటుడు అలీ సోమవారం లోటస్పాండ్లో జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. గుంటూరు తూర్పు నుంచి తెదేపా తరఫున అలీ పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగింది.
అయితే తెదేపా నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో తాను పార్టీ మారినట్లు అలీ మీడియాకు వెల్లడించారు. ఇంకా వైకాపా తరపున ప్రచారానికి పరిమితం అవుతానే కానీ.. పోటీ చేసేది వుండదని అలీ క్లారిటీ ఇచ్చారు.