వేసవిలో కీరదోస ముక్కలు.. ఎంత మేలు చేస్తాయో తెలుసా?

0
94
cucumber-green

cucumber-green

వేసవిలో కీరదోసను తీసుకోవడంద్వారా చర్మం ఆరోగ్యంగా తాజాగా కనిపిస్తుంది. ఇంకా వేడితో శరీరం కోల్పోయిన నీటిని కీరదోస భర్తీ చేస్తుంది.
ఎండ ప్రభావం వల్ల చర్మం కందిపోతుంది. కీరదోస ముక్కలతో చర్మం మీద రుద్దుకుంటే సాంత్వన లభిస్తుంది. టాన్‌ సమస్య నుంచి చర్మాన్ని కాపాడుతుంది.

కీరదోస తినడం వల్ల శరీరంలో నీటి పరిమాణం పెరుగుతుంది. దాంతో ఒంట్లోని మలినాలు, విషపదార్థాలు బయటకు పోతాయి. యూరిక్‌ ఆమ్లం నిల్వలు తగ్గిపోతాయి. కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కూడా కరిగిపోతాయి. కీరదోస రసాన్ని బచ్చలి, క్యారెట్‌ రసంతో కలిపి కూడా తీసుకోవచ్చు. తరచుగా కీర తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది.

క్యాల్షియాన్ని ఎముకలకు అందించి, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్‌ కె సాయపడుతుంది. కీరదోస రసం తాగితే చిగుళ్ల గాయాలు తగ్గిపోతాయి. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. కీరదోసంలో లభించే సిలికా మూలకం కేశాలను, గోళ్లను దృఢంగా మార్చి, వాటిని మెరిసేలా చేస్తుంది.

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడే మెగ్నీషియం, పొటాషియం, సిలికాన్‌ వంటి మినరల్స్‌ కీరదోసలో ఉంటాయి. చల్లచల్లని కీర ముక్కలను కళ్ల మీద కొద్దిసేపు ఉంచితే కళ్ల కింద ఏర్పడే వలయాలు తగ్గిపోతాయి. కళ్ల అలసట కూడా పోతుంది. కీర ముక్కల్ని సలాడ్స్‌ లేదా సూప్‌ రూపంలో తీసుకోవడం ద్వారా శరీరానికి నీటితో పాటు పీచుపదార్థం కూడా అధికంగా అందుతుంది. దాంతో తొందరగా ఆకలి వేయదు. ఆహారం తక్కువగా తింటారు. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది. డయాబెటిస్, హృద్రోగ వ్యాధులు దూరమవుతాయి.