ఆ స్టార్ల జీవితాలు వేరు.. మా అన్న బయోపిక్ అక్కర్లేదు : నాగబాబు

Naga Babu comments on the life of Chiranjeevi biopic is in the works

0
48
nagababu - chiru
nagababu - chiru

భారతీయ సినీ పరిశ్రమలో ఇపుడు బయోపిక్‌ల కాలం నడుస్తోంది. తెలుగులో ఇప్పటికే పలువురు సీనియర్ నటుల జీవితాల ఆధారంగా పలు చిత్రాలు వచ్చాయి. వీటిలో కొన్ని ఫెయిల్ అయితే మరికొన్ని సక్సెస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి బయోపిక్‌పై నటుడు నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ వార్తలపై నాగబాబు స్పందిస్తూ, మెగాస్టార్‌పై బయోపిక్ తీయాల్సిన అవసరం లేదన్నారు. రాంచరణ్ కూడా తన తండ్రి బయోపిక్ తీయకపోవడమే ఉత్తమమంటూ సూచించారు. నా సోదరుడు కెరీర్ మొదట్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఆయన చాలా విజయవంతంగా సినీ కెరీర్‌ను కొనసాగించారు.

సావిత్రి, సిల్క్ స్మిత, సంజయ్ దత్‌లాంటి స్టార్ల జీవితాలు వేరు. వారి జీవితాల్లో ఎన్నో విభిన్న పార్శ్వాలున్నాయి. అందుకే వారి బయోపిక్‌లు తీస్తే ప్రేక్షకులు ఎగబడి మరీ థియేటర్లకు వచ్చారు. ఓ వ్యక్తి జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు అనేవి బయోపిక్‌కు చాలా ప్రాధాన్యమైన అంశం. అలాంటి నేపథ్యంతో సినిమా తీస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మెగాబ్రదర్ చేసిన ఈ కామెంట్స్ తో ఇక భవిష్యత్ లో చిరు బయోపిక్ ఉండకపోవచ్చని అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు.