నువ్వుల పొడి తయారీకి కావలసిన పదార్ధాలు
* నువ్వులు 200 గ్రాములు,
* ఎండుమిరపకాయలు 8,
* ఉప్పు తగినంత
తయారు చేసే విధానం
* ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి నూనె లేకుండా నువ్వులను దోరగా వేయించుకోవాలి.
* ఎండుమిరపకాయలు కమ్మని వాసన వచ్చేవరకు వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో తగినంత ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకుని ఒక సీసాలో భద్రపరుచుకోవాలి.
* మీకు కావలసినప్పుడు తీసుకొని ఇడ్లీలో, దోశలోకి, అన్నంలోకి వాడుకోవచ్చు. ఇలా చేసి ఉంచిన పొడి పదిహేను రోజులు వరకు నిల్వ ఉంటుంది.