పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్యవి కాబట్టి బతికిపోతున్నావ్…

0
44
Renu Desai
Renu Desai

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌పై పవన్ అభిమానులు మరోమారు రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్యవు కాబట్టి బతికిపోతున్నావ్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఇటీవల రేణూ దేశాయ్ ఓ టీవీ ఛానెల్‌తో కలిసి రైతుల సమస్యల్ని తెలుసుకోవడానికి పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు ఆమె అనుచిత సందేశాలు పంపారు. ‘నేను ఓ రైతు కొడుకును. దాదాపు 20 ఏళ్లుగా మేం వ్యవసాయం చేస్తున్నాం. రైతుల కోసం మీరేం చేశారు? ఏమీ చేయలేదు. డబ్బుల కోసం మేకప్‌ వేసుకుని కెమెరా ముందు డ్రామా చేశారంతే’ అంటూ మెసేజ్ పెట్టాడు.

మరో నెటిజన్ అయితే ఓ అడుగు ముందుకేసి… ‘పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్యవి కాబట్టి మీకు ఈ మాత్రం గౌరవం ఇస్తున్నాం. లేకపోతే మీకు ఎటువంటి గుర్తింపు లేదు’ అంటూ కామెంట్ చేశాడు. వీటికి సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ను ఆమె మంగళవారం పోస్ట్‌ చేశారు. అదే ఓ సెలబ్రిటీ ఇలా మాట్లాడి ఉంటే చాలా హంగామా చేసేవారు కదా అని ప్రశ్నించారు.