భళారే… బిర్యానీ ఆకు…

0
164
biryani leaf
biryani leaf

ప్రతి ఒక్కరికీ ఘుమ ఘుమ‌లాడే బిర్యానీ అంటే అమితంగా ఇష్టపడుతారు. లొట్టలేసుకుని ఆరగిస్తుంటారు. అయితే అందులో వేసే బిర్యానీ ఆకుల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడు తెలుసుకుందాం.

* బిర్యానీ ఆకు అజీర్తికి చాలా మంచి మందు. పావు లీటరు నీళ్లలో నాలుగైదు ఆకులూ, చిన్న అల్లం ముక్క వేసి పావు వంతు అయ్యేవరకూ మరిగించి తేనె కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.
* మూత్రపిండాల్లో రాళ్లు చేరవు. ఉన్నా కరిగిపోతాయి.

* ఈ ఆకుల్ని నీళ్లలో వేసి బాగా నానబెట్టి ఆ తర్వాత వాటిని మాడు మీద బాగా రుద్ది, షాంపూ చేస్తే అందులోని పదార్థాలు కారణంగా చుండ్రు పోతుంది.
* ఆకుల్ని మెత్తగా రుబ్బి నుదుటికి పట్టిస్తే తలనొప్పి తగ్గుతుంది.

* ఆకుల్ని పొడి చేసి నెల రోజుల పాటు పావు టీస్పూను చొప్పున పరగడుపున మందులా మింగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
* ఈ ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి ఆ వాసన పీల్చడం వల్ల ఒత్తిడి, అందోళనలు తగ్గుతాయి. కాబట్టి ఎక్కువగా వంటల్లో వాడటంతోబాటు ఆకుల్ని మరిగించిన నీటిని టీ రూపంలో తాగినా మంచిదే.