బొప్పాయి జ్యూస్‌కు కాస్త నిమ్మరసం కలిపి తీసుకుంటే.. నాలుకకు రుచి పెరుగుతుంది. బొప్పాయిలో పీచుతోపాటు ఇందులో ఉండే పొటాషియం, ఇతర విటమిన్లు హృద్రోగాల్ని రానివ్వవు. డయాబెటిస్ వల్ల వచ్చే హృద్రోగాల్ని పచ్చిబొప్పాయి తగ్గిస్తుంది. బొప్పాయికి పొట్టలోని నులిపురుగుల్ని చంపేసే గుణం కూడా ఉంది. బొప్పాయి గుజ్జుని గాయాల మీద రాయడం ద్వారా ఎంజైమ్స్ కారణంగా అవి తగ్గిపోతాయి.
ఎముకల పరిపుష్టికి ఇందులోని విటమిన్-కె ఎంతో తోడ్పడుతుంది. ఇది శరీరం కాల్షియంను పీల్చుకునేలా చేయడంతో ఎముకలు బలంగా ఉంటాయి. ఆర్థరైటిస్‌నీ నిరోధిస్తుంది. రోజూ బొప్పాయి తినేవాళ్లలో కీళ్లనొప్పులు రావు. శరీరభాగాల్లో తలెత్తే ఇన్‌ఫ్లమేషన్ లేదా మంటని తగ్గించేందుకు ఇందులోని కోలీన్ ఎంతో సహాయపడుతుంది. పచ్చి బొప్పాయి శృంగార ప్రేరితంగానూ పనిచేస్తుంది.
నెలసరి క్రమంగా రానివాళ్లలో పచ్చిబొప్పాయి తిన్నా రసం తాగినా అది సరవుతుంది. బొప్పాయి శరీరంలో వేడిని పుట్టిస్తుంది కాబట్టి ఇది ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా నెలసరిని క్రమబద్ధీకరిస్తుంది. బొప్పాయి మంచి పెయిన్‌కిల్లర్‌గానూ పనిచేస్తుంది. నరాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. మహిళల్లో వెన్నెముకకు ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.