దంతాలపై పేరుకున్న పాచి పోవాలంటే…

0
65
teeth
teeth

చాలామందికి దంతాలపై పాచి పేరుకునిపోయి ఉంటుంది. దీనివల్ల దంతాలు పచ్చగా కనిపిస్తుంటాయి. నలుగురిలో మాట్లాడలన్నా, నవ్వాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. దంతాలపై పేరుకున్న పాచి నుంచి విముక్తి పొందాలంటే చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు.. అవేంటే తెలుసుకోండి.

* చక్కని పలు వరుస మీ నవ్వును కొనసాగించేలా చేస్తుంది. చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటే మీ ఆత్మ విశ్వాసం రెట్టంపవుతుంది.

* తాజా క్యారెట్లను శుభ్రంగా కడుక్కొని తినాలి. క్యారెట్‌ను కొరికి తినడం ద్వారా దంతాల మీద పాచి, బ్యాక్టీరియా తొలగిపోతుంది. చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

* అరటి పండు తొక్కలో పళ్లను తెల్లగా మార్చే గుణాలున్నాయి. అరటి తొక్కతో పళ్ల మీద ఒక నిమిషం పాటు రుద్దుకోవాలి.

* అరటి తొక్కలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ దంతాల మీద ఉండే మలినాలను తొలగించి వాటిని తెల్లగా మార్చడమేకాకుండా దంతాల ఆరోగ్యానికి దోహదపడుతాయి.

* స్ట్రాబెర్రీలోని మాలిక్ ఆసిడ్ దంతాలకు తెలుపునిస్తుంది. ఇందులోని పీచుపదార్థం దంతాల మీద బ్యాక్టీరియాను తొలగించి చిగుళ్ల సంబంధ వ్యాధుల్ని నివారిస్తుంది.