వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డికి మరో తలనొప్పి తప్పలేదు. జగన్ విషయంలో టీడీపీ మరో బాంబు పేల్చింది. ఇంకా జగన్ క్విడ్ ప్రోకో సంబంధించిన ఆధారాలను వెలికితీసింది. సీబీఐకి అప్పటి ఈడీ డైరక్టర్ రాసిన లేఖను టీడీపీ ప్రస్తుతం బయటపెట్టింది.
ఎనిమిది సంస్థలతో జగన్‌కు క్విడ్ ప్రోకో వుందని అప్పటి సీబీఐ డైరక్టర్ ఆస్థానాకు అప్పటి ఈడీ డైరక్టర్ కర్నాల్ సింగ్ లేఖ రాశారు. 2017లోనే జగన్ అక్రమాలను నిర్ధారించినా… విచారణను తొక్కిపెట్టినట్టు ఆ లేఖలో ఉన్నట్టు తెలిపింది.
ఈ కేసుకు సంబంధించిన విచారణ నుంచి తప్పించుకునేందుకే మోదీకి జగన్ సరెండర్ అయ్యారని మండిపడింది. టీడీపీ ఇప్పుడు బయటపెట్టిన లేఖ ఇప్పుడు సంచలనం రేపుతోంది. వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2009లో ఇందూ గ్రూపుకు దాదాపు 100 ఎకరాల భూమిని ఇచ్చారని… వాటిలో 11 ఎకరాలను జగన్ బినామీ సంస్థలకు ఇందూ గ్రూపు ఇచ్చిందని కర్నాల్ సింగ్ పేర్కొన్నారు