కార్తీతో రష్మిక మందన.. కోలీవుడ్‌లో రచ్చ రచ్చ చేస్తుందా?

0
94

ఛలో, గీత గోవిందం లాంటి హిట్ సినిమాలతో టాలీవుడ్‌ తెరంగేట్రం చేసిన రష్మిక కోలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టింది. తాజాగా కార్తీ హీరోగా చేస్తోన్న కొత్త సినిమాలో ఈ కన్నడ భామ రష్మిక నటిస్తోంది. బుధవారం పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ‘రెమో’ ఫేమ్ బక్కియ రాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్నాడు.

గీత గోవిందం సినిమాతో హిట్ హీరోయిన్‌గా ముద్రవేసుకున్న రష్మిక.. అదే ల‌క్కీ కోస్టార్ విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ సినిమాలో న‌టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్ప‌టికే సొంత ఇండ‌స్ట్రీ కన్నడలోనూ వ‌ర‌స సినిమాలు చేస్తూ ర‌చ్చ చేస్తున్న ర‌ష్మిక‌.. ఇప్పుడు త‌న ఫోక‌స్ త‌మిళ్ ఇండ‌స్ట్రీపై మ‌ళ్లించింది.

కార్తీతో ఓ రొమాంటిక్ లవ్ స్టోరీలో రష్మిక నటించనుంది. ఈ చిత్రానికి ఎస్ఆర్ ప్రభు నిర్మాత‌. ఇప్ప‌టికే కార్తితో ఈయ‌న ఖాకీ సినిమాను నిర్మించాడు. ఇది రెండో సినిమా. ఈ చిత్రంతోనే ర‌ష్మిక త‌మిళ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతుంది. ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నానని రష్మిక చెప్పింది.