నా భార్యకు పూర్వానుభవం ఉన్నట్టేనా?

0
55
Bride
Bride

మాది విజయవాడ. ఇటీవలే వివాహమైంది. శోభనం రోజున తామిద్దరం శారీరకంగా కలిశాం. కానీ, నా భార్యకు రక్తస్రావం కాలేదు. దీంతో ఆమెకు పూర్వానుభవం ఉందనే అనుమానం కలుగుతుంది. ప్రతి అమ్మాయికీ తొలి కలయికలో రక్తస్రావం వస్తుందని స్నేహితులు చెబుతుంటారు. స్నేహితుల మాట నమ్మి నా భార్యను అనుమానించాలా? సలహా ఇవ్వండి.

ప్రతి అమ్మాయికీ తొలి కలయికలోనే రక్తస్రావం కావాలన్న రూలేంలేదు. కొందరికి రక్తం కనిపించవచ్చు. మరికొందరికి కనిపించకపోవచ్చు. అంతమాత్రాన ఆమెను కన్య కాదు అని భావించరాదు. తొలి కలయికలో రక్తం కనిపించడానికి కారణం, ఆమె కన్నెపొర చిరగడమే!

ఈ పొర కొందరిలో మందంగా ఉండి తొలి కలయికతోనే చిరుగుతుంది. ఎక్కువశాతం మందిలో ఈ పొర పలుచగా ఉండి బాల్యంలో ఆటలాడే సమయంలోనే చిరిగిపోతుంది. ఎత్తు నుంచి దూకినా, గుర్రపు స్వారీ చేసినా…. ఇలా శారీరక శ్రమ ఎక్కువగా ఉండే ఎలాంటి ఆటలాడే సమయంలోనైనా కన్నెపొర చిరిగిపోవచ్చు.

ఇలాంటి అమ్మాయిలకు తొలి కలయిక సమయంలో రక్తం కనిపించదు. కాబట్టి మీ భార్యకి కూడా ఇలాగే జరిగి ఉండవచ్చు. రక్తస్రావం గురించి ఎవరో చెప్పిన మాటలువిని భార్యను అనుమానించడం భావ్యం కాదు. ఈ అనుమానాలు వీడి దాంపత్య జీవితాన్ని ఆస్వాదించండి.