వణికిపోతున్న పాకిస్థాన్… నౌకాశ్రయాలు ఖాళీ.. ఎందుకంటే…

0
70
Karachi Ports
Karachi Ports

పాకిస్థాన్‌కు భారత్ భయం పట్టుకుంది. భారత వైమానికదళం ఎక్కడ మెరుపుదాడులు చేస్తుందన్న భయంతో వణికిపోతోంది. ఇందులోభాగంగా ముందుజాగ్రత్తగా తమ దేశంలోని నౌకాశ్రయాలన్నింటినీ ఖాళీ చేయిస్తోంది. అక్కడ ఉన్న నౌకలను శరవేగంగా తరలిస్తోంది. ఫలితంగా నౌకాశ్రయాలన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి.

కరాచీ, ఒర్మార, గ్వాదర్ నౌకాశ్రయాల్లో గత నెల 28 వరకు నౌకలు దర్శనమిచ్చాయి. ఈ విషయాన్ని ఉపగ్రహ చిత్రాలు నిర్ధారించాయి. మొత్తం తొమ్మిది ఫ్రిగేట్లు, 8 జలాంతర్గాములు, 17 గస్తీ నౌకలు, ఇతర చిన్నాచిన్నా నౌకలు అన్నీ నౌకాశ్రయాల్లోనే ఉన్నాయి.

అయితే, పాకస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరంపై భారత్ వైమానిక దాడుల తర్వాత నౌకాశ్రయాల్లోని నౌకలన్నీ ఒక్కొక్కటిగా సముద్రంలోకి వెళ్లిపోయాయి. దీంతో షిప్‌యార్డ్‌లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని షిప్‌యార్డులలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది.

భారత్ దాడితో అప్రమత్తమైన పాక్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే నౌకలను సముద్రంలోకి తరలించినట్టు తెలుస్తోంది. 1971లో జరిగిన ఘటన పాక్ కళ్లముందు ఇప్పటికీ కదలాడుతుండడంతోనే పాక్ తన నౌకల విషయంలో అప్రమత్తమైనట్టు వార్తలు వస్తున్నాయి.

అప్పట్లో ‘ఆపరేషన్ ట్రైడెంట్’ పేరుతో భారత నావికా దళం కరాచీ పోర్టును ధ్వంసం చేసింది. ఆ నాటి నష్టం నుంచి కోలుకోవడానికి పాక్‌కు దశాబ్దాలు పట్టిన విషయం తెల్సిందే. ఇపుడు ఇదేవిధంగా భారత్ తెగబడే అవకాశం ఉందని భావించిన పాక్.. నౌకాశ్రయాలను ఖాళీ చేయిస్తోంది.