హనుమంతుడికి తులసీ మాలను సమర్పిస్తే.. ఎంత మంచి కలుగుతుందో?

0
161

హనుమంతుడికి తులసీ మాలను సమర్పించడం ద్వారా ఎలాంటి ఫలితాలను పొందవచ్చునో తెలుసుకుందాం. హనుమంతుడికి తులసీమాలను సమర్పించడం ద్వారా శనిదోషాల నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే ఆంజనేయునికి ”శ్రీరామ జయం” అంటూ 108 సార్లు తమలపాకులపై రాసి మాలగా సమర్పిస్తే.. అనుకున్న కోరికలు నెరవేరుతాయి.

పూర్వం దేవతలు, రాక్షసులు పాల కడలిని చిలికినప్పుడు.. ఆ సమయంలో కల్పతరువు, ఐరావతం, కామధేనువు, మహాలక్ష్మి, చంద్రుడు ఉద్భవించారు. అలాగే శ్రీ మహాలక్ష్మీ దేవి ఉద్భవించిన ఆనందంలో ఆమె కంట ఆనందభాష్పాలు.. అమృత కలశంలో పడ్డాయని.. ఆ కలశంలో పచ్చని రంగుతో శ్రీ తులసీ మహాదేవి ఉద్భవించినట్లు పురాణాలు చెప్తున్నాయి.

తులసీ, లక్ష్మీ అంటే మహావిష్ణువు ప్రీతికరం. తులసీ దళంలో 33 కోట్ల దేవతలు, అశ్విని దేవతలు, బ్రహ్మదేవుడు, లక్ష్మీ, సరస్వతీ, గాయత్రి, పార్వతీ దేవిలు కొలువై వుంటారు. తులసీ అంటేనే పాపాలు తొలగిపోతాయి. తులసీని సంరక్షించే వాడు పరమాత్మగా కొలువబడుతాడు. తులసీని ఆరాధించడం ద్వారా ఆయుర్దాయం పెరుగుతుంది. కీర్తిప్రతిష్టలు, అష్టైశ్వర్యాలు పెంపొందుతాయి.

తులసీ మాలను శ్రీవారికి సమర్పిస్తే కష్టనష్టాలు తొలగిపోతాయి. తులసీ తీర్థాన్ని సేవించిన వారికి మోక్షం లభిస్తుంది. తులసీ మాల, తమలపాకుల మాలలను ఆంజనేయునికి సమర్పించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. ఆంజనేయ స్వామిని పూజించేందుకు ముందు.. శ్రీరామ జయం లేదా శ్రీ రామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని 54 లేదా 108 సార్లు ఉచ్ఛరించాలి. ఆపై ప్రార్థనను విన్నవించుకోవాలి. తదుపరి తులసీతో అర్చన జరపాలి.

బుధ, గురు, శనివారాల్లో హనుమంతునికి పూజ చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. హనుమంతునికి వ్రతం ఆచరించే వారికి గురువారం, శనివారం కలిసివస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా, సంతానం ప్రాప్తించాలన్నా, అనారోగ్య సమస్యలు తొలగిపోవాలన్నా.. తులసీ దళాలతో విష్ణువుకి లేదా హనుమంతుని అర్చించాలి. లేదంటే తులసీ మాలను సమర్పించుకోవాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.