పెళ్ళి పీటలపై వధువు.. కాల్చి చంపేసిన ప్రియుడు.. ఎక్కడ?

0
45
bride

 

brideపెళ్లి పీటలపై వున్న వధువును ఆమె ప్రియుడు కాల్చి చంపేశాడు. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనను కాదని ప్రేయసికి మరో వ్యక్తితో వివాహం జరుగుతుండటాన్ని జీర్ణించుకోలేక పోయిన ప్రియుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలోని ఘజియాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బిజేంద్ర-ఆశ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలన్న వీరి కోరికకు ఆశ కుటుంబ సభ్యులు అడ్డు పడ్డారు. అంతేకాదు, వేరే వ్యక్తితో ఆమెకు పెళ్లి నిశ్చయించారు. తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గిన ఆశ పెళ్లికి అంగీకరించక తప్పలేదు.

ప్రియురాలు వేరే వ్యక్తిని పెళ్లాడబోతోందన్న విషయం తెలిసిన బిజేంద్ర జీర్ణించుకోలేకపోయాడు. తుపాకితో పెళ్లికి వచ్చి ఆశాపై కాల్పులు జరిపాడు. ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆశ పెళ్లిపీటలపైనే ప్రాణాలు విడిచిపెట్టగా, బిజేంద్ర ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.